ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి.. ఎందుకో మన వాళ్ళకు తెగ నచ్చేసింది..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. ఇంతకూ ఆ అమ్మాయి ఎవరంటే..

ఆ అమ్మాయి పేరు ప్రియ వారియర్.. కేరళ లోని త్రిసూర్ కు చెందిన అమ్మాయి. అక్కడి విమల కాలేజ్ లో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఓ చిన్న రోల్ కోసం తీసుకున్నారు. అయితే ప్రియ వారియర్ కు ఇచ్చిన ఆ చిన్న సీన్లలోనే చాలా బాగా చేయడంతో మెయిన్ రోల్ ఇచ్చేశారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన ‘మాణిక్య మలయార పూవి’ పాట బాగా హిట్ అవ్వడం.. ముఖ్యంగా ఈ అమ్మాయి ఇచ్చిన హావభావాలు చాలా బాగా ఉండడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి.. ఆ అమ్మాయి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here