క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ.. ఐసీసీ ప్రకటన..!

2017కు గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే కోహ్లీకి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, సర్ గార్ ఫీల్డ్ సోబర్స్  ట్రోఫీ కూడా లభించింది. అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. జనవరి 18న ఐసీసీ ఈ అవార్డులను ప్రకటించింది.

పాకిస్థాన్ కు చెందిన హసన్ అలీకి ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. సన్ రైజర్స్ ఆటగాడు.. ఆఫ్ఘనిస్థాన్ తురుపుముక్క రషీద్ ఖాన్ కు ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇక పాకిస్థాన్ భారత్ మీద గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ ఘటనను ఐసీసీ ఫ్యాన్స్ మొమెంట్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించారు. 2009 తర్వాత పాకిస్థాన్ గెలిచిన ఐసీసీ ఈవెంట్ ఇదే. ఇందులో చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ ను పాకిస్థాన్ ఓడించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here