కోహ్లీకి 12 లక్షల ఫైన్..!

చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో చెన్నై జట్టు భారీ స్కోరును సాధించింది. అంబటి రాయుడు అద్భుతమైన బ్యాటింగ్ కు మహేంద్రసింగ్ ధోని ఫినిషింగ్ తోడవటంతో 200 పరుగుల పైన టార్గెట్ కూడా తక్కువగానే అనిపించింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఎంత భారీ స్కోరు సాధించినా కూడా విజయాన్ని అందించలేకపోవడంతో బెంగళూరు బౌలర్ల మీద తీవ్ర నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

ఇక ఇప్పటికే ఆరు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు ఓడిపోయిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లీకి 12 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కోహ్లీ మినిమమ్ ఓవర్ రేట్ నిబంధనలను అతిక్రమించాడని.. అందుకే ఫైన్ వేశామని ఐపీఎల్ తమ ప్రెస్ రిలీజ్ లో చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here