నరేంద్ర మోడీకి సవాల్ విసిరిన కోహ్లీ.. స్వీకరించిన మోడీ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొందరు సెలెబ్రిటీలు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ ను ప్రమోట్ చేస్తున్నారు. అందుకోసం ఒక్కో సెలెబ్రిటీ ముగ్గురు సెలెబ్రిటీలను నామినేట్ చేసి.. వారి ఫిట్ నెస్ నిరూపించుకునే వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. విరాట్ కోహ్లీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకే సవాల్ విసిరారు. దీన్ని ఆయన స్వీకరించడం విశేషం. కోహ్లీ మోడీతో పాటూ తన భార్య అనుష్క శర్మ, మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఛాలెంజ్ విసిరారు.

రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మంగళవారం నాడు తాను పుషప్స్ తీస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ ‘ఫిట్ నెస్ మంత్ర’ అని ట్యాగ్ లైన్ తగిలించి హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్ లకు సవాల్ విసిరాడు. కోహ్లీ, ఈ వీడియోను చూసి, దానిలోని చాలెంజ్ ని స్వీకరించి, అందులో చూపించినట్టుగా స్పైడర్ ప్లాంక్ చేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేస్తూ, ఇదే చాలెంజ్ ని తాను తన భార్య, మన ప్రధాని, సోదరుడు ధోనీకి విసురుతున్నా అని వ్యాఖ్యానించాడు.

నరేంద్ర మోడీ ఆ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని చెప్పి.. త్వరలోనే ఆ వీడియోను పోస్ట్ చేస్తానని చెప్పడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here