భ‌ర్త‌ను చంప‌డానికి రూ.30 ల‌క్ష‌లు..ప్లాన్ స‌క్సెస్‌! ఆ త‌రువాతే..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ పేరు ఆశా గైక్వాడ్‌. 44 సంవ‌త్స‌రాల ఈ మ‌హిళ ముంబై శివార్ల‌లోని క‌ళ్యాణ్‌లో భ‌ర్త‌తో క‌లిసి నివాసం ఉంటోంది. సెల్‌ఫోన్ పిచ్చి. ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్‌లో ఎవ‌రితోనో గంట‌ల కొద్దీ మాట్లాడ‌టం ఆమె అల‌వాటు. వ్య‌స‌నం కూడా. అది ఆమె భ‌ర్త‌కు న‌చ్చ‌లేదు. ప‌లుమార్లు చెప్పి చూశాడు. విన‌లేదు. మార‌నూ లేదు. దీనితో విసుగెత్తి త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ ప‌డేవాడు. ఈ ఘ‌ర్ష‌ణ ఎంత దాకా తీసుకెళ్లిందంటే.. భ‌ర్త‌ను హ‌త్య చేయించేంత‌గా!

ఆ భ‌ర్త పేరు శంక‌ర్ గైక్వాడ్‌. మంచి ఆస్తిప‌రుడు. క‌ళ్యాణ్‌లోని ప్రైమ్ లొకేష‌న్‌లో అత‌ని పేరు మీద 25 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లం ఉంది. దీని విలువ 15 కోట్ల రూపాయ‌ల పైమాటే. ఈ ఆస్తిపై క‌న్నేయ‌డంతో పాటు.. సెల్‌ఫోన్ గొడ‌వ త‌లెత్త‌డంతో శంక‌ర్‌ను హ‌త్యకు ప్లాన్ వేసింది. దీనికోసం లోక‌ల్ గూండా హిమాన్షు దూబేతో బేరం మాట్లాడింది.

30 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇచ్చేలా ఒప్పందం. ఇందులో భాగంగా- మొద‌టి విడ‌త ఆమె అత‌నికి నాలుగు ల‌క్షల రూపాయ‌ల‌ను ముట్ట‌జెప్పింది కూడా. కింద‌టి నెల 18వ తేదీన స‌తారాకు బ‌య‌లుదేరాడు శంక‌ర్ ఒంట‌రిగా. ఈ విష‌యాన్ని ఆశా గైక్వాడ్ హిమాన్షు దూబేకు చేర‌వేసింది. అత‌ణ్ని అనుస‌రించి దూబే త‌న స్నేహితులు జ‌గ‌న్ మాత్రే, రాజ్‌సింగ్‌, ప్రీత‌మ్‌ల‌తో క‌లిసి శంక‌ర్‌ను హ‌త్య చేశారు. మృత‌దేహాన్ని మాయం చేశారు.

త‌న భ‌ర్త క‌నిపించ‌ట్లేదంటూ ఆశా అదే నెల 21వ తేదీన స్థానిక కోల్సేవాడి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. ద‌ర్యాప్తులో భాగంగా.. శంక‌ర్, ఆశా దంప‌తుల ఆస్తి కోసం త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంటూ ఉండేద‌ని తేలింది. దీనితో పోలీసులు ఆశా గైక్వాడ్ కాల్ లిస్ట్‌ను ప‌రిశీలించ‌గా, దూబే అత‌ని స్నేహితుల బండారం బ‌య‌ట‌ప‌డింది. అన్ని సాక్ష్యాధారాల‌తో పోలీసులు ఆశాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించ‌గా.. త‌న నేరాన్ని అంగీక‌రించారు. దీనితో ఆమెను కోల్సేవాడి పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌కు త‌ర‌లించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here