అర్ధరాత్రి నరేంద్ర మోడీ మీద సంచలన కామెంట్ చేసిన దర్శకుడు కొరటాల శివ..!

మహేష్ బాబు హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమా టీజర్ గురించి పలువురు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ చూపించిన కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆయన అర్ధరాత్రి సమయంలో ఓ సంచలన ట్వీట్ చేశాడు. అది కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు ఏకి పడేస్తున్నారు. దీనిపై కొరటాల శివ కూడా స్పందించారు.

రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో తెలుగు ప్రజలు పలు కామెంట్లు చేశారు. అలా కామెంట్లు చేసిన వారిలో కొరటాల శివ కూడా ఉన్నారు. కొరటాల శివ డైరెక్ట్ గా నరేంద్ర మోడీని తన ట్వీట్ లో ప్రస్తావించారు. “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి, ఆయన్ను మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్?” అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here