కాస్టింగ్ కౌచ్‌లో నా పేరా! కొర‌టాల శివ క్లారిటీ!

హైద‌రాబాద్‌: టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న కాస్టింగ్ కౌచ్ అంశంలో టాప్ డైరెక్ట‌ర్ కొరటాల శివ పేరు కూడా బ‌య‌టికొచ్చింది. సమాజ సేవ పేరుతో సినిమాలు తీసే స్టార్‌ డైరెక్టర్‌లు కూడా కాస్టింగ్ కౌచ్‌లో ఉన్నారంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ద‌ర్శ‌కుడు కొరటాల శివ స్పందించారు. కాస్టింగ్ కౌచ్‌లో త‌న పేరు రావ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అన్నారు.

తాను ఎలాంటి వాడిన‌నేది త‌న సినిమాలు చూస్తే తెలిసిపోతుంద‌ని, త‌న గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని అన్నారు. తాను ఎలాంటి వాడినో తన చుట్టూ ఉన్నావారికి తెలుసని అన్నారు. కాస్టింగ్ కౌచ్ వంటి అస‌భ్య ప‌నుల‌కు తాను దూరంగా ఉంటాన‌ని చెప్పారు. అసభ్యకరమైన వాఖ్యలతో కూడా ఎవరిని పిలవన‌ని అన్నారు.

ఆడ, మగ అనే తేడా తనకు లేదని, అందరి పట్ల కృతజ్ఞతగా ఉంటానని కొరటాల చెప్పారు. త‌న పేరును నేరుగా ఎవ‌రూ ప్ర‌స్తావించ‌లేద‌ని, అయిన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌పై స్పందించాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని అన్నారు. త‌న భార్య కూడా ఈ విషయంలో అండ‌గా ఉంద‌ని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here