కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో మ‌న‌దేశానికి షాక్‌! ఇద్ద‌రు అథ్లెట్ల బ‌హిష్క‌ర‌ణ‌..కార‌ణం అదే!

గోల్డ్‌కోస్ట్‌: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ప‌త‌కాల‌ను కొల్ల‌గొడుతోన్న మ‌న‌దేశ క్రీడాకారుల‌కు షాక్‌. డోపీలనే అనుమానంతో ఇద్ద‌రు అథ్లెట్లు బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. ట్రిపుల్ జంప‌ర్ రాకేశ్ బాబు, రేస్ వాక‌ర్ ఇర్ఫాన్ కొలొథుమ్ థోడిలను కామ‌న్వెల్త్ క్రీడా స‌మాఖ్య బ‌హిష్క‌రించింది.

ఇప్ప‌టికిప్పుడు వారిని కామ‌న్వెల్త్ క్రీడా గ్రామం విడిచి వెళ్లాల‌ని ఆదేశించింది. వారి గ‌దుల్లో ఇంజెక్ష‌న్ వేసుకోవ‌డానికి ఉప‌యోగించే సూదులు ల‌భించ‌డ‌మే దీనికి కార‌ణం. దీనితో వారు డోపింగ్ పాల్ప‌డి ఉంటార‌ని స‌మాఖ్య అనుమానించింది. నిజానికి- కామ‌న్వెల్త్ క్రీడా సమాఖ్య `నో నీడిల్ పాల‌సీ`ని అమ‌లు చేస్తోంది.

క్రీడాకారుల వ‌ద్ద గానీ, వారి గ‌దుల్లో గానీ సూదులు ఉండ‌కూడ‌దు. ఉంటే..క్రీడ‌ల నుంచి బ‌హిష్క‌రిస్తారు. కామ‌న్వెల్త్ క్రీడ‌ల ప్రారంభానికి చాలా రోజుల ముందే దీన్ని ప్ర‌క‌టించింది స‌మాఖ్య‌.

 

దీనికి విరుద్ధంగా రాకేశ్ బాబు, ఇర్ఫాన్ కొలొథుమ్ థోడి గ‌దుల్లో సూదులు ల‌భించ‌డంతో వారిని బ‌హిష్క‌రించిన‌ట్లు స‌మాఖ్య ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. అప్ప‌టిక‌ప్పుడు క్రీడా గ్రామాన్ని వదిలి వెళ్లాల‌ని ఆదేశించారు. ఇర్ఫాన్‌.. ఇప్ప‌టికే 20 కిలోమీట‌ర్ల రేస్ వాక్‌లో పాల్గొన్నాడు. 13వ స్థానంలో నిలిచాడు. ట్రిపుల్ జంపింగ్‌లో రాకేశ్ బాబు 12వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here