అప్పట్లో ఆగడు సినిమా చూసి కేటీఆర్ ఏమన్నారంటే..!

మహేష్ బాబు సినిమాల్లో చెత్త సినిమాల్లో ఒకటి ఏదైనా ఉందంటే అది ‘ఆగడు’ అని మహేష్ బాబు అభిమానులే అంటారు. ఆ విషయాన్ని ఇటీవల కేటీఆర్-మహేష్ బాబు మధ్య జరిగిన చిన్న ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. ‘ఆగడు’ చూసి కేటీఆర్ ఏమన్నది మహేష్ పంచుకోవడం విశేషం. ‘స్టాప్ డూయింగ్ దిస్ నాన్సెన్స్’ అని అన్నాడట ‘ఆగడు’ చూసిన అనంతరం కేటీఆర్. ఈ మాట చెప్పినపుడు ఇటు మహేష్.. అటు కేటీఆర్ ఇద్దరూ నవ్వేశారు. ‘ఆగడు’ గురించి మహేష్ మాట్లాడటం మొదలుపెట్టగానే కేటీఆర్ తల పట్టుకున్నాడు.


ఈ సందర్భంగా మహేష్ తనను సర్ అని సంబోధిస్తుంటే.. అలా వద్దు రాము అనమని కేటీఆర్ చెప్పాడు. కేటీఆర్ ఎప్పుడు తన సినిమా చూసినా తనకు టెన్షన్ గానే ఉంటుందని.. ఎందుకంటే బాగుంటేనే బాగుందని చెబుతాడని.. లేదంటే బాలేదని ముక్కుసూటిగా చెప్పేస్తాడని అంటూ ‘ఆగడు’ ఉదాహరణ చెప్పాడు మహేష్. మహేష్ బాబు ఏజ్ గురించి కూడా కేటీఆర్ పలు కామెంట్లు చేసి నవ్వులు పూయించాడు. నిజంగా ఈ ఇంటర్వ్యూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here