డబ్బులు ఉన్నాయిగా ఏటీఎంలలో అని అన్న జైట్లీ.. కేటీఆర్ కౌంటర్ ఇచ్చారుగా..!

దేశవ్యాప్తంగా నగదు లేక ఏటీఎంలలో డబ్బులు లేవు, ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే..! కానీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం వేరేగా చెప్పారు. అసలు నగదుకు కొరతనేదే లేదని ఆయన చెప్పడం నెటిజన్లకు ఏ మాత్రం నచ్చడం లేదు. నగదుకు కొరతపై పెద్ద ఎత్తున వార్తలు వస్తుండడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు. నగదు పరిస్థితులను తాను సమీక్షించినట్టు చెప్పారు. ‘‘దేశంలో నగదు లభ్యతపై సమీక్ష నిర్వహించా. మొత్తం మీద సరిపడనంత నగదు చలామణిలో ఉంది. బ్యాంకుల వద్ద నగదు అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి అసాధారణ డిమాండ్ పెరగడంతో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే వెంటనే దీన్ని పరిష్కరించడం జరిగింది’’ అని జైట్లీ ట్వీట్ చేశారు.

అయితే అరుణ్‌ జైట్లీపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ స్పందిస్తూ… బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయని ట్వీట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని కేటీఆర్ కౌంటర్ వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here