బాలయ్య పక్కనే ఉన్నాడు.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పిన కేటీఆర్..!

నందమూరి బాలకృష్ణ పక్కనే ఉన్నాడు.. ఆ సమయంలో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పారు. ఇంతకూ కేటీఆర్ తన ఫేవరెట్ హీరో ఎవరంటే అది నందమూరి బాలకృష్ణనే..! హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను కేటీఆర్, బాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.. సినీ పరిశ్రమలో తనకు అందరికంటే ఎంతో ఇష్టమైన నటుడు బాలకృష్ణ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.

అలాగే తన పేరు గురించి కూడా అయన ప్రస్తావించారు. దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తనకు తారకరామారావు అనే పేరును నాన్న కేసీఆర్ పెట్టారని… తారకరామారావు పేరును నిలబెట్టే పనులే చేస్తానని, చెడగొట్టే పనులు మాత్రం చేయనని చెప్పారు. బసవతారకం ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. అవసరమైనవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ‘బసవతారకం ఆసుపత్రి గురించి మా అమ్మ నాకు కనీసం వంద సార్లు చెప్పి ఉంటారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వసతికి, ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని చెప్పేవారు’ అని తెలిపారు. క్యాన్సర్ ను అవగాహనతోనే నిర్మూలించవచ్చని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని చెప్పారు.

బాలయ్య మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ మీద అభిమానంతో తన కుమారుడికి తారకరామారావు అని కేసీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని చెప్పారు. కేటీఆర్ చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్యాన్యర్ బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 40 బెడ్స్ తో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here