రాంగ్ రూట్ లో హైదరాబాద్ పోలీస్ కార్.. దీనికి కేటీఆర్ ను స్పందించమని కోరగా..?

నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లకు ఉండవా అని అనిపించే ఫోటో ఇది..! ఎందుకంటే ఫోటోలో లారీ-బస్సు సరైన రూట్ లో వెళుతుంటే పోలీసు వాహనం మాత్రం రాంగ్ రూట్ లో వెళుతోంది. దీన్ని చూసిన ఓ నెటిజన్ ఎలాగైనా ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

పోలీస్ వెహికల్ రాంగ్ రూట్ లో వెళుతుంది.. ఇదే పబ్లిక్ చేస్తే ఈ పోలీసులు ఏం చేస్తారు అంటూ కేటీఆర్ ను అడిగారు. ఈ పోస్ట్ పై వెంటనే స్పందించారు మంత్రి కేటీఆర్. ఎట్టి పరిస్థితులలోనూ ఇలాంటి చర్యలను ఉపేక్షించమని ఆయన అన్నారు.. అంతే కాకుండా ఆ ఫొటోను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కు షేర్ చేశారు.

మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ట్వీట్ పై స్పందించారు రాచకొండ కమిషనర్‌. ట్విట్టర్‌ ద్వారా తేదీ, సమయం తెలుసుకున్నారు. మే 23వ తేదీ మధ్యాహ్నం 3-4 గంటల మధ్య వాహనం నడిపిన సిబ్బంది ఆరా తీశారు. TS09 PA 0651 వాహనం నడిపిన డ్రైవర్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ రంగన్నగా గుర్తించారు. అదే వాహనంలో ఉన్న LB నగర్‌ పీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బుగ్గరాములుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here