కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ పై కేటీఆర్ ట్వీట్.. నవ్వుకోవడమే..!

కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క రాజకీయాల గురించే కాకుండా పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ సర్వేపై ఆయన చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది.

‘ఇంగ్లిష్‌ ఛానెళ్లలో కర్ణాటక ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను చూడడం కంటే కన్ఫ్యూజ్‌ అయ్యే విషయం మరొకటి లేదు. రెండు ఇంగ్లిష్ చానళ్లు బీజేపీకే అత్యధిక స్థానాలంటుంటే, మరో రెండు చానళ్లు కాంగ్రెస్‌కే అత్యధిక సీట్లని చూపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్‌లా ఉన్నాయి’ అని ట్వీట్‌ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా కర్ణాటక ఎన్నికల్లో ఖచ్చితంగా హంగ్ వస్తుందని.. ఎవరికి కూడా సంపూర్ణ ఆధిక్యం రాదని చెబుతూ వస్తున్నారు. ఈ దశలో ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే చూపించాయి. అందుకే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here