కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నానని చెప్పేసిన కుమారస్వామి..!

భారతీయ జనతా పార్టీకి భారీ ఝలక్ ఇస్తూ కర్ణాటకలో జేడీఎస్ నాయకుడు కుమారస్వామి అధికారాన్ని చేపట్టబోతున్నారు. బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవెగౌడతో భేటీ అయి చర్చించిన తరువాత జేడీఎస్‌ నేత కుమారస్వామి తుది నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ మద్దతు లభించడంతో తమ రాష్ట్ర గవర్నర్‌కు కుమారస్వామి ఓ లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య గవర్నర్‌ను కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్‌ కావాలని, తాము కాంగ్రెస్‌ మద్దతును అంగీకరిస్తున్నామని ఆ లేఖలో కుమారస్వామి పేర్కొన్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీఎస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య తమ గవర్నర్‌ నివాసానికి వెళ్లి కాసేపు చర్చించారు. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. కర్ణాటకలో తమ మద్దతుతో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను సిద్ధరామయ్య కోరినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here