ఫారెస్ట్ ఆఫీస‌ర్‌..ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో..మ‌హిళ‌తో రెడ్‌హ్యాండెడ్‌గా !

కర్నూలు జిల్లాలో డివిజ‌న‌ల్ అట‌వీ అధికారి ఆయ‌న‌. పేరు వెంక‌టేశ్వ‌ర‌రావు. త‌న హోదా, స్థాయి మ‌రిచి అట‌వీశాఖ గెస్ట్‌హౌస్‌లో అనైతిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డారు. రాస‌లీలు సాగించారు.

ప్ర‌తి శ‌ని, ఆదివారాల్లో ఆయ‌న ప‌ని ఇదేన‌ట‌. అట‌వీ శాఖ గెస్ట్‌హౌస్‌ను ఓ బ్రోత‌ల్ హౌస్‌గా మార్చివేశార‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన విద్యార్థులు స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

దీనితో ఆయ‌న‌పై నిఘా వేసిన పోలీసులు.. ఆయ‌న‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్న ప‌రిస్థితుల్లో ఓ మ‌హిళ‌తో అట‌వీశాఖ గెస్ట్‌హౌస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌టం సంచ‌ల‌నం రేపింది.

సోమవారం అర్థరాత్రి గెస్ట్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేసి వెంకటేశ్వరరావుతో పాటు ఆయనతో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మ‌హిళ వివ‌రాల‌ను వెల్ల‌డించలేదు. ఈ ఘ‌ట‌న‌పై అట‌వీశాఖ ఉన్న‌తాధికారులు వెంకటేశ్వర రావును సస్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here