ఆమె వయసు 20 సంవత్సరాలు కూడా లేదు.. ఆరున్నర కోట్ల రూపాయల హ్యాండ్ బ్యాగ్లు..!

కైలీ జెన్నర్.. సోషల్ మీడియా సంచలనం.. కొన్ని మిలియన్ల మంది ఈ మోడల్ ను ఫాలో అవుతూ ఉంటారు. వయసు ఇంకా 20 సంవత్సరాలే.. ఇప్పటికే ఆర్జించడంలో ఆకాశాన్ని తాకుతోంది ఈ యువతి. ఇటీవలే ఈ రియాలిటీ టీవీ షో స్టార్ అయిన కైలీ జెన్నర్ ఓ సెల్ఫీ తీసుకుంది. అందులో ఆమె హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. అందులో చాలా హ్యాండ్ బ్యాగులే ఉన్నాయి. అయితే ఈ హ్యాండ్ బ్యాగుల మొత్తం విలువ 1 మిలియన్ అమెరికన్ డాలర్లట..! అంటే భారత్ కరెన్సీలో ఏకంగా ఆరున్నర కోట్ల రూపాయలు.

ఒక బ్రాండ్ హ్యాండ్ బ్యాగు ధర 30 లక్షల రూపాయలు ఉంటే.. ఇంకో దాని ధర 20 లక్షల పై మాటనే అట..! అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ లలో తక్కువ ధర ఉన్నది 3 లక్షల రూపాయలే..! ప్రముఖ డిజైనర్ కంపెనీలకు చెందిన హ్యాండ్ బ్యాగ్ లు ఆమె వద్ద ఉన్నాయి. మొత్తం ధర 1మిలియన్ డాలర్ల కంటే ఎక్కువేనట.. ఇక ఆమె ఆస్థి కూడా దాదాపు 1బిలియన్ డాలర్లు మించిపోయిందట. ఆమె కుటుంబ సభ్యులైన కర్దాషియన్స్ కంటే కైలీ జెన్నర్ దగ్గరే ఎక్కువ ఆస్థి ఉందని అంటున్నారు.

సోషల్ మీడియాలో ఆమె చేసే వీడియోలకు కూడా చాలా ఎక్కువగానే డబ్బులు ముట్టజెప్పుతూ ఉంటాయి ప్రముఖ కంపెనీలు..! అలా ఆమె మిగిలిన వారితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా సంపాదించడం మొదలుపెట్టింది. ఇంత తక్కువ వయసులోనే ఆమె అంత సంపాదించడంపై నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here