అజ్ఞాతవాసి.. మీ మౌనం ఇక చాలు.. కోర్టును ఆశ్రయించబోతున్నా..!

అజ్ఞాతవాసి సినిమాకు ముందు ఫ్రెంచ్ సినిమా లార్గోవించ్ ను కాపీ కొట్టి తీశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ విషయంపై స్పందించిన ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సాలీ సినిమా చూసొచ్చాక చెబుతానని చెప్పాడు. ఆయన మొదటి రోజే టికెట్ కొనుక్కొని వెళ్ళి మరీ చూసొచ్చాడు. అప్పటి నుండి అజ్ఞాతవాసి చిత్ర బృందం మీద పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అజ్ఞాతవాసి సినిమా చాలా భాగం తన సినిమాలో నుండే లేపేశారని.. తనకు కూడా నష్టపరిహారం చెల్లించాలని అడిగాడు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ అజ్ఞాతవాసి సినిమా బృందాన్ని మరిన్ని కష్టాల్లోకి తోయనుంది.

“కాపీ కొట్టకుండా క్రియేటివిటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ చిత్ర పరిశ్రమకు ఉందనే భావిస్తున్నాను. అయితే, గత వారం రోజులుగా ‘అజ్ఞాతవాసి’ టీమ్ నుంచి మౌనమే సమాధానమైంది. ఇక చట్టపరమైన చర్యలకు దిగనున్నా” అని జెరోమ్ సాలీ తన ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించారు.

సినిమా విడుదలై వారం రోజులు దాటినా, తన ఆరోపణలపై స్పందన రాలేదని ఆరోపించిన ఆయన, ఇక చర్యలు తీసుకోవడం ఒక్కటే తన ముందున్న మార్గమని, లీగల్ నోటీసులు పంపనున్నానని స్పష్టం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here