చిలుకకు అంతిమ సంస్కారాలు.. పెద్ద కర్మ నిర్వహించి భోజనాలు కూడా పెట్టించాడు..!

కొందరికి మూగ జంతువుల మీద ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. వాటిని కూడా తమ కుటుంబసభ్యులగానే భావిస్తారు. అలాంటి వ్యక్తి గురించే ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అల్లారుముద్దుగా పెంచుకున్న చిలుక చనిపోవడంతో ఏకంగా దానికి అంతిమసంస్కారాలు నిర్వహించడమే కాకుండా.. దినం రోజు పలువురిని పిలిచి భోజనాలు కూడా పెట్టాడట..! ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

అమ్రోహీ ప్రాంతానికి చెందిన పంకజ్‌ కుమార్‌ మిట్టల్ చిలుకను ఐదేళ్ల నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటోన్నాడు. ఆయన ఓ ఉపాధ్యాయుడు. చిలుక అనారోగ్యం పాలై ఇటీవల మృతి చెందింది.. దీంతో మిట్టల్ చాలా బాధపడి పోయాడు. ఇంట్లో మనిషి చనిపోతే ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో అచ్చం అలాగే ఆ చిలుకకు నిర్వహించా. చిలుకకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించి, తమ బంధువులకు భోజనాలు పెట్టాడు. అంతే కాకుండా సంస్మరణ సభ సైతం నిర్వహించి ఆ చిలుకపై అతడికి ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here