2019లో ఐపీఎల్ మొదలయ్యే రోజు చెప్పేశారు.. ఈసారి చాలా తొందరగా..!

2018 ఐపీఎల్ ఫైనల్ ముగిసి వారం కూడా కాలేదు అప్పుడే 2019 గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే ఐపీఎల్ సీజన్ 12 ప్రారంభమయ్యే డేట్ ను ప్రకటించేశారు. 2019 లో ఐపీఎల్ మార్చి 29న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఏప్రిల్ రెండో వారంలో కాకుండా వచ్చే ఏడాది రెండు వారాల ముందుగా ఐపీఎల్ సీజన్-12ను ప్రారంభించనున్నారు.

అదే ఏడాది జనరల్ ఎలక్షన్స్ కూడా అదే సమయంలో జరగనున్నాయి. అంతే కాకుండా ఐపీఎల్ అయిపోగానే మే 30న ఇంగ్లండ్-వేల్స్ లో ఐసీసీ ప్రపంచకప్ మొదలుకాబోతోంది. దీంతో ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ ను త్వరగా ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. 2019లో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ మే 30న ప్రారంభంకానుంది. నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు ఒక టోర్నీ ముగించుకుని మరో టోర్నీలో మ్యాచ్‌ ఆడేందుకు 15 రోజుల విరామం కచ్చితంగా ఉండాలి. అందుకే ఐపీఎల్‌ను ముందే నిర్వహించాలని భావిస్తున్నారు.

వీలైతే విదేశాల్లో ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. గతంలో కూడా రెండు సార్లు ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించారు. 2009 లో ఐపీఎల్ ను సౌత్ ఆఫ్రికాలో నిర్వహించగా డెక్కన్ ఛార్జర్స్ విజయం సాధించింది. ఇక 2014లో 19రోజుల పాటూ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఐపీఎల్ ను నిర్వహించారు. 2019లో ఐపీఎల్‌ మార్చి 29 నుంచి మే 19 వరకు జరగాల్సివుంది. అదే సమయంలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ”ఐపీఎల్‌ జరగాల్సిన సమయంలోనే ఎన్నికలు వస్తే.. అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటాం. టోర్నీని తరిలించాల్సి వస్తే వేదిక యూఏఈ అయ్యే అవకాశాలే ఎక్కువ” అని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here