ప‌ట్టు పంచె, తెల్ల చొక్కా, ప‌ట్టు కండువా! ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పంచాంగ శ్ర‌వ‌ణం!

గుంటూరు: ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విళంబి నామ తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ‌ను వేడుక‌గా జ‌రుపుకొన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా పంచాంగ క‌ర్త‌లు జ‌గ‌న్‌కు వేద మంత్రాలతో ఆశీర్వ‌చ‌నాలు ప‌లికారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లోనే జ‌గ‌న్ ఉగాది వేడుక‌ల్లో పాల్గొన్నారు.

ప‌ట్టుపంచె, తెల్ల‌రంగు చొక్కాను ధ‌రించి, భుజంపై ప‌ట్టు కండువాను వేసుకుని జ‌గ‌న్‌.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని గుర్తు చేశార‌ని అభిమానులు చెబుతున్నారు. పంచాంగ శ్ర‌వ‌ణం సంద‌ర్భంగా పంచాగ‌క‌ర్త‌లు మాట్లాడుతూ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌ను ప్ర‌జ‌లు మ‌రోసారి చూస్తార‌ని చెప్పారు.

 

జగన్‌కు, రాష్ట్రానికి మేలు జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో సహస్త్ర చండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్‌ పూర్ణాహుతి కోసం వస్తారని అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో జననేత వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి వైఎస్‌ జగన్‌ జాతకంలోని దోషాల‌న్నీ తీరిపోతాయని, ఆయ‌న‌కు రాజయోగం పడుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here