విరాట్ కోహ్లీని అక్కడ ఆడనివ్వకూడదట.. ఆ పెద్దాయన మాటలు విన్నారా..?

ఐపీఎల్ అయిపోయిన తర్వాత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కౌంటీల్లో ఆడడానికి ఇంగ్లాండ్ వెళుతున్నాడు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉండడంతో మన కెప్టెన్ అక్కడ రాటుదేలాలని అనుకున్నాడు. అయితే ఓ పెద్ద మనిషి వాదన మాత్రం మరోలా ఉంది. కోహ్లీకి ఇంగ్లండ్‌ తో టెస్టు సిరీస్‌ కు ముందు కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించవద్దని ఆ దేశ మాజీ పేసర్ బాబ్ విల్లీస్ ఈసీబీ (ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు)కి సూచించాడు.

ఇదేంటి అని అనుకుంటున్నారా.. ఆయన వాడ వేరేలా ఉందిలేండి.. అక్కడ కానీ ఆడితే.. కోహ్లీ ఇంగ్లాండ్ పిచ్ లకు బాగా అలవాటు పడిపోతాడట.. అంతేకాకుండా కోహ్లీకి కౌంటీల్లో ఆడే అవకాశం ఇస్తే ఇంగ్లండ్‌ సొంతగడ్డపై మరో ఓటమికి సిద్ధమైనట్లేనని ఆయన భావిస్తున్నాడు. విదేశీ ఆటగాళ్లందరికీ మన కౌంటీల్లో ఆడే అవకాశం కల్పించడం ద్వారా ఇంగ్లండ్ లో వారు రాణించే వీలు కల్పిస్తున్నామని ఆయన ఈసీబీని హెచ్చరించాడు. ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు కోహ్లీకి భారీ మొత్తాన్ని ఇస్తూ, ఆటకు పదునుపెట్టుకునే అవకాశం ఇవ్వడం అంత తెలివితక్కువ పని ఇంకోటి లేదని ఆయన స్పష్టం చేశాడు. కౌంటీల్లో కోహ్లీకి ఆడే అవకాశం కల్పించడం కంటే, స్వదేశంలోని యువ ఆటగాళ్లకు ఆ అవకాశం కల్పిస్తే మెరికల్లాంటి ఆటగాళ్లు తయారవుతారని బాబ్ విల్లీస్ సూచించాడు. గత టెస్టు సిరీస్‌ లాగే ఈసారి కూడా కోహ్లీ బాగా ఇబ్బంది పడాలని కోరుకుంటున్నానని అన్నాడు. గత ఇంగ్లాండ్ టూర్ లో విరాట్ కోహ్లీ భారీగా విఫలమైన సంగతి తెలిసిందే.. మన జట్టు కూడా అక్కడ ఓటమిని మూటగట్టుకుని వచ్చింది. అందుకే ఆ పెద్దాయన ఎక్కడ కోహ్లీ అద్భుతంగా ఆడేస్తాడో.. సిరీస్ వాళ్ళని కాకుండా పోతుందోనని భయపడిపోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here