గుంపులో గోవింద‌! సామూహిక వివాహాల్లో ఒక్క‌టైన లెస్బియ‌న్ల జంట‌!

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల సంద‌ర్భంగా ఓ లెస్బియ‌న్ల జంట కూడా ఏక‌మైంది. ప‌నిలో ప‌నిగా వారిద్ద‌రు కూడా పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక‌రి వ‌య‌స్సు 20, మ‌రొక‌రి వ‌య‌స్సు 22 సంవ‌త్స‌రాలు. వారిద్ద‌రూ అమ్మాయిల‌నే విష‌యం చివ‌రి వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు.

22 సంవ‌త్స‌రాలున్న యువ‌తి ప్యాంట్‌, ష‌ర్ట్, దాని పైన బ్లేజ‌ర్ వేసుకుని టిప్‌టాప్‌గా త‌యారు కాగా.. ఇంకో అమ్మాయి ప‌సుపురంగు చీర క‌ట్టుకుని, సామూహిక వివాహాల్లో కూర్చున్నారు. అబ్బాయిలాగా త‌యారైన అమ్మాయి మాత్రం త‌న ముఖం క‌నిపించ‌కుండా ఏర్పాటు చేసుకుంది. సామూహిక వివాహాల్లో పెద్ద‌ల హాజ‌రు త‌ప్ప‌నిస‌రి.

ఈ ఇబ్బంది కూడా లేకుండా.. ఆ అమ్మాయిలిద్ద‌రూ త‌మ స్నేహితులను త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులుగా వేషం వేయించి తీసుకొచ్చారు. పెళ్ల‌యిన రెండోరోజు వారి గుట్టు ర‌ట్ట‌యింది. స్థానికులు ఈ విష‌యాన్ని గుర్తించారు. వ‌రుడిగా ఉన్న వ్య‌క్తి మ‌హిళ అని అంటూ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. వారి త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి, ప్ర‌శ్నించ‌గా.. ఈ విష‌య‌మే త‌మ‌కు తెలియ‌ద‌ని అన్నారు. పెళ్లికి త‌ల్లిదండ్రుల రూపంలో వ‌చ్చిన వాళ్లు స్నేహితుల‌ను తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. వారిపై కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here