దుబాయ్ లో భారతీయుడికి జీవితఖైదు.. రూమ్ మేట్ తో ఏమి చేశాడో తెలుసా..?

దుబాయ్ న్యాయస్థానం ఓ భారతీయుడికి జీవితఖైదు విధించింది. గతంలో 10 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష విధించిన కోర్టు.. ఇప్పుడు అతడికి జీవిత ఖైదును విధించింది.. అంటే దాదాపు 25సంవత్సరాలు జైలులోనే ఉండాలి. తాగిన మత్తులో తన రూమ్ మేట్ ను కిటికీ లో నుండి తోసి చంపేశాడు. ఆ సమయంలో అతడి రూమ్ మేట్ కూడా మద్యం మత్తులోనే ఉన్నాడు.

30సంవత్సరాల భారతీయ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా గొడవ తలెత్తింది. అతడి రూమ్ మేట్ కుటుంబసభ్యులను దూషించాడు. దీంతో అతడు కిటికీలో నుండి తోసేశాడు. అలా కిటికీలో నుండి తోసేసిన తర్వాత ఎమర్జెన్సీకి ఫోన్ చేయకుండా నిద్రపోయాడు. బాధితుడు అక్కడే మరణించాడు. నవంబర్ 11, 2016 లో కేసు నమోదైంది. గత ఏడాది అక్టోబర్ లో ఈ కేసులో తీర్పును ఇస్తూ భారతీయుడికి 10 సంవత్సరాల శిక్షను విధించింది. అయితే తాజాగా ఏకంగా జీవిత ఖైదును విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.


ఇంతకూ గొడవకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలీలేదు. తలకు బలమైన గాయం తగలడం వలన, పలు ఎముకలు ఇరిగిపోవడమే కాకుండా.. బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన తీర్పును 30 రోజుల్లోగా సవాల్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here