వేటగాన్ని వేటాడి చంపేసిన సింహాలు..!

వణ్య మృగాల మనుగడ చాలా ఏళ్ళుగా తగ్గుతూ వెళుతోంది. ఒకప్పుడు వేళల్లో ఉన్న వన్య ప్రాణులు.. ఇప్పుడు వందల్లో ఉన్నాయి. జంతువుల చర్మాల కోసం, వాటి గోళ్ళ కోసం వేటగాళ్ళు చట్టాలని అతిక్రమించి వాటిని చంపుతున్నారు. అయితే అలా సింహాలని చంపడానికి అడవి లోకి వెళ్ళిన ఓ వేటగాన్ని సింహాలు వేటాడి.. వెంటాడి.. చంపేశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.

ఆఫ్రికా దేశాల్లో సింహాల మనుగడ చాలా చాలా తగ్గుతూ వెళుతోంది. వాటిని విపరీతంగా వేటాడేశారు. తాజాగా అలా వేటకు వెళ్ళిన వ్యక్తిని సింహాలే చంపేశాయని బీబీసీ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. లింపోపో పోలీసు అధికారి మోత్సే మాట్లాడుతూ వేటాడడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మీదకు సింహాలు ఎదురుదిరిగాయత.. అతన్ని చుట్టుముట్టిన సింహాలు అతడి మీద దాడి చేశాయి. అతడు భయపడుతూ.. గట్టిగా అరిచినా ప్రయోజనం లేకపోయింది. అతడి తల మినహా మిగతా భాగాలని సింహాలను తినేశాయి.

అతడి శవానికి అతి దగ్గరలో ఓ తుపాకి పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం కేవలం 20,000 ఆఫ్రికన్ లయన్స్ మాత్రమే మనుగడ సాగిస్తూ ఉన్నాయి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here