ఒంట‌రిగా వ‌చ్చే మ‌హిళ‌ల‌ను గ‌ర్భ‌గుడిలోకి ర‌మ్మ‌నే పూజారి! అందుకే గుడ్డ‌లూడ‌దీసి!

ఒంట‌రిగా గుడికి వ‌చ్చే మ‌హిళ‌లే అత‌ని టార్గెట్‌. ఒంట‌రి మ‌హిళ‌ల కోసం ఎదురు చూస్తుంటాడీ పూజారి. వారిని మాత్ర‌మే గ‌ర్భ‌గుడిలోకి ఆహ్వానిస్తాడు. ఆపై వారిపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతాడు. ఇదీ ఆ పూజారి దైనందిన చ‌ర్య‌. ప‌లుమార్లు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ.. త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోవ‌డంతో స్థానికులు గుడ్డ‌లూడ‌దీసి కొట్టారు.

క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలో చోటుచేసుకుంది ఈ ఘ‌ట‌న‌. ఆ పూజారి పేరు గోపాల‌య్య‌. స్థానిక శంభాజీ రోడ్డులోని ఓ ఆల‌యంలో ప‌నిచేస్తుంటాడు. కొంత కాలంగా గుడికొచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మ‌హిళ‌లు ఈ విష‌యంపై ఆల‌య సిబ్బందికి తెలియ‌జేశారు. ఈ విష‌యం స్థానికుల‌కు కూడా తెలియ‌డంతో వారు అత‌ణ్ని హెచ్చ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.. అత‌ను త‌న వైఖ‌రిని మార్చుకోలేదు. రెండురోజుల కింద‌ట సాయంత్రం పూట ఒంట‌రిగా గుడికొచ్చిన ఓ భక్తురాలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విష‌యం ఆమె స్థానికుల‌కు తెలియ‌జేశారు. దీనితో స్థానికులు అత‌నితో ఘ‌ర్ష‌ణ ప‌డ్డారు. క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో గొడ‌వ జ‌రిగింది. పూజారితో గొడ‌వ ప‌డుతున్న స‌మయంలో.. ఆయ‌న అనుచ‌రులు స్థానికుల‌పై యాసిడ్ విసిరారు.

 

ఈ యాసిడ్ దాడిలో ఇద్ద‌రు యువ‌కుల‌కు కాలిక గాయాల‌య్యాయి. మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స్థానికులు గోపాల‌య్య‌ను చిత‌క‌బాదారు. ప్యాంట్‌ ఊడదీయించి ఊరేగించారు. పూజారితో పాటు అత‌ని అనుచ‌రుల‌ను కొట్టి, బెళ‌గావి రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here