ఒక్క పాము పిల్లే అనుకుంటే.. ఏకంగా వంద పాములొచ్చాయ్‌!

చెన్నై: కొద్దిరోజుల నుంచి ఖాళీగా ఉంటోన్న ఆ ఇంట్లో పాములు కాపురం పెట్టేశాయి. ఆ ఇంట్లో నుంచి రెండోరోజుల‌కోసారి పాము పిల్ల క‌నిపిస్తోంటే.. పొరుగింటి వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రోజూ క‌నిపిస్తుండ‌టంతో ఆగ‌లేక‌.. ఆ ఖాళీగా ఉన్న ఇంటి వెన‌క వైపు వెళ్లి, బిగుసుకుపోయారు. అయిదు కాదు, ప‌ది కాదు ఏకంగా వంద‌కుపైగా పాము పిల్ల‌లు క‌నిపించాయి.

మ‌రికొన్ని పొద‌గ‌డానికి రెడీగా ఉన్న పాము గుడ్లు ఉన్నాయి. దీనితో బిత్త‌ర‌పోయిన స్థానికులు అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని గుడియాత్తంలో చోటు చేసుకుంది. రాయ‌ వేలూరు జిల్లా గుడియాత్తం స‌మీపంలోని ఇందిరానగర్‌లో కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్న ఇల్లు అది.

ఉదయం ఆ ఇంటి వెనుక వైపునకు వెళ్లి చూసిన ఇరుగుపొరుగు వారికి ఒకేచోట వందకు పైగా పాము పిల్లలు క‌నిపించాయి. పొద‌గ‌డానికి సిద్ధంగా ఉన్న మ‌రికొన్ని గుడ్లు క‌నిపించాయి. వెంట‌నే వారు గుడియాత్తం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకుని, సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న అట‌వీ సిబ్బంది వాటిని సుర‌క్షితంగా ప‌ట్టుకుని, స‌మీప అడ‌వుల్లో వ‌దిలేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here