భ‌గ‌భ‌గ‌మండే అగ్నిగోళాన్ని లారీలో వేసుకుని తీసుకెళ్తున్న‌ట్టు లేదూ!

గ‌డ్డి మోపుల‌ను తీసుకెళ్తోన్న లారీ ఒక‌టి మంట‌ల్లో చిక్కుకున్న ఘ‌ట‌న ఇది. గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ శివార్ల‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం క‌నిపించింది. రాజ్‌కోట్-అమ్రేలీ మార్గంలో వెళ్తోన్న ఆ లారీ ఓ విద్యుత్ తీగ‌కు త‌గులుకుంది. దీనితో నిప్పుర‌వ్వ‌లు చెల‌రేగి గ‌డ్డిమోపుల‌పై ప‌డ‌టంతో మంట‌లు చెల‌రేగాయి. కొస‌మెరుపేమిటంటే- లారీ ద‌గ్ధ‌మౌతోన్న విష‌యాన్ని డ్రైవ‌ర్ ప‌ట్టించుకోలేదు.

అత‌నికి ఆ విష‌య‌మే తెలియ‌దు. అత‌ని ధ్యాస అంతా రోడ్డు మీదే ఉంది. మండుతున్న అగ్నిగోళంలా దూసుకొస్తోన్న లారీని చూసిన స్థానికులు బెంబేలెత్తారు. గ‌ట్టిగా కేక‌లు వేస్తూ డ్రైవ‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేశారు. వెంట‌నే- డ్రైవ‌ర్ దాన్నిరోడ్డు ప‌క్క‌న ఆపేసి, నీళ్ల కోసం చూస్తే..అవి క‌నిపిస్తేగా. ఫైరింజ‌న్‌కు క‌బురు పెట్టే స‌మ‌యానికి అగ్ని దేవుడు స్వాహా చేసేశాడు. అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చేట‌ప్ప‌టికి అక్క‌డ ఏమీ మిగ‌ల్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here