ఓ లోడు లారీ కారు మీద ప‌డింది..ఇంకేమైనా ఉందా?

చామ‌రాజ‌న‌గ‌ర‌: క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. సామ‌ర్థ్యానికి మించిన లోడుతో జాతీయ ర‌హ‌దారిపై వెళ్తోన్న ఓ లారీ.. అదుపు త‌ప్పింది. ఆగివున్న‌ కారుపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో కారు డ్రైవ‌ర్‌తో స‌హా ముగ్గురు మ‌ర‌ణించారు. వారిలో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

గాయ‌ప‌డ్డ వారిని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. మృతుల‌ను సిద్ధ‌రామ‌, సంకేత్‌కుమార్‌, ల‌క్ష్మీకాంత్‌గా గుర్తించారు. జిల్లాలోని సోమ‌వారపేట స‌మీపంలో 209 జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం శ‌నివారం ఉద‌యం చోటు చేసుకుంది.

పిల్ల‌ల‌కు వేస‌వి సెల‌వులు రావ‌డంతో క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌పుర జిల్లా హిండి తాలూకాలోని కుళ్లురుగియ గ్రామానికి చెందిన సిద్ధ‌రామ‌, త‌న కుటుంబంతో క‌లిసి కారులో త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

అనంత‌రం స్వ‌గ్రామానికి తిరిగి వ‌స్తూ, కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌డానికి ఓ చోట కారును ఆపారు. అదుపు త‌ప్పి, వేగంగా వ‌చ్చిన లారీ ఆ కారుపై ప‌ల్టీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చామ‌రాజ‌న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here