విడాకులు తీసుకున్న న‌టిని రెండో పెళ్లి చేసుకున్న న‌టుడు: మ‌రో అమ్మాయితో విలాసంగా!

భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తోన్న ఓ న‌టిపై వ‌ల విసిరాడు ఓ వ‌ర్ధ‌మాన న‌టుడు. కొత్త జీవితాన్ని ప్ర‌సాదిస్తానంటూ న‌మ్మించాడు. అత‌ని మాట‌ల‌ను న‌మ్మిన ఆమె అత‌ణ్ణి రెండో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహబంధం మూడేళ్ల పాటు మాత్ర‌మే కొన‌సాగింది.

ఆ త‌రువాత ఆ వ‌ర్ధ‌మాన న‌టుడు కాస్తా ఇండ‌స్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవ‌డంతో.. మ‌రో అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. విలాసంగా జీవిస్తున్నాడు. అత‌ను చేసిన మోసంపై ఆ న‌టి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. ఆ న‌టి పేరు రాధికా షెట్టి.

ఆ వ‌ర్ధ‌మాన న‌టుడు అమిత్‌. వారిద్ద‌రూ క‌లిసి ఇదివ‌ర‌కు `న‌మితా ఐ ల‌వ్ యూ` అనే క‌న్న‌డ సినిమాలో న‌టించారు. అప్పుడే వారి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ మూవీ విడుద‌లైన కొద్దిరోజుల త‌రువాత ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.

 

క‌ర్ణాట‌క‌లోని ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం సిగందూరు చౌడేశ్వ‌రి ఆల‌యంలో 2013 మే 21వ తేదీన ఈ వివాహం జ‌రిగింది. ఆ త‌రువాత ఇద్ద‌రూ బెంగ‌ళూరు రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాధికా షెట్టి సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టారు.

అమిత్ అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చారు. కాస్త గుర్తింపు వ‌చ్చిన త‌రువాత అత‌ను ముఖం చాటేశాడు. ఇంకో అమ్మాయితో ప్రేమాయ‌ణం న‌డ‌ప‌సాగాడు. రాధికాషెట్టితో దూరంగా ఉండ‌సాగాడు. ఇంటికి కూడా వెళ్లేవాడు కాద‌ట‌. అత‌ని మొబైల్ కూడా స్విచాఫ్ వ‌చ్చేది.

రెండురోజుల కింద‌ట అనుకోకుండా రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్‌లోనే రాధికా షెట్టికి తార‌స‌ప‌డ్డాడు అమిత్‌. దీనితో ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమెను కొట్టాడ‌ట కూడా.

దీనితో రాధికా షెట్టి రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో అమిత్‌పై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here