బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన బికినీ వేసుకుంటున్న వీడియో తీసి అతడికి పంపించింది.. అతడేమో..!

కొన్ని కొన్నిసార్లు తెలివి ఉండే ప్రవర్తిస్తున్నారా.. లేదా అని అనిపించకమానదు ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే..! బాయ్ ఫ్రెండ్ తన ప్రేయసికి బికినీని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆమె ఆ బికినీ వేసుకుంటూ వీడియో రికార్డు చేసి.. ప్రియుడికి పంపించింది. అయితే ఆ యువకుడు మాత్రం తన బుద్ధిని ప్రదర్శించాడు. తాను చెప్పింది చెయ్.. లేదా వీడియోను వైరల్ చేస్తానంటూ ఆ యువతిని ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు లోని కళ్యాణ నగర్ కు చెందిన జోషి ఓ ఆటో డ్రైవర్. అతడికి ఓ ప్రేయసి ఉంది. ఆమెకు జోషి గిఫ్ట్ గా బికినీ ఇచ్చాడు. ఆమె దాన్ని వేసుకుని ఓ వీడియో చిత్రీకరించి ప్రియుడికి పంపింది. అయితే వీడియో దొరకగానే జోషి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తాను చెప్పింది చేయాలని బెదిరించడం మొదలుపెట్టాడు. వీడియోను యుట్యూబ్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. నీ భవిష్యత్తు మొత్తం నా చేతుల్లోనే ఉంది.. చెప్పింది చెయ్ అంటూ ఆమెను బెదిరించడంతో చివరికి పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. సైబర్ క్రైమ్ పోలీసులు జోషిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి జోషితో మూడేళ్ళుగా ప్రేమలో ఉందట.. అన్నేళ్ళు ప్రేమించిన అమ్మాయినే మోసం చేశాడంటే.. ఈ కాలం ప్రేమలను అసలు నమ్మలేము..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here