రెండేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత త‌మ మ‌ధ్య ఉన్న బంధుత్వ‌మేంటో తెలిసి..!

హ‌స‌న్‌: ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. పెళ్లి చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఇళ్లొదిలి పారిపోయిన ఆ జంట‌.. చివ‌రికి స్వ‌గ్రామానికి చేరుకుని, ఊరి బ‌య‌టే చెట్టుకు ఉరి వేసుకుంది. ఇలా హ‌ఠాత్తుగా వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టానికి గ‌ల కార‌ణం.. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధుత్వ‌మే. నిజానికి- వారిద్ద‌రూ తండ్రీ కుమార్తెల వ‌రుస‌.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల పేర్లు న‌య‌న‌, అశోక్‌. జిల్లాలోని ఆలూరు తాలూకా మ‌డ‌బ‌లు గ్రామ‌స్తులు. అశోక్ ఆటో డ్రైవ‌ర్‌. అదే గ్రామానికి చెందిన న‌య‌న అనే పీయూసీ విద్యార్థిని ప్రేమించాడు. రెండేళ్లుగా వారిద్దరి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం సాగుతోంది. న‌య‌న‌కు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్న విష‌యాన్ని ఆమె అశోక్‌కు తెలియ‌జేసింది.

దీనితో వారు కింద‌టి నెల 23వ తేదీన పారిపోయారు. వెళ్లేట‌ప్పుడు న‌య‌న ఇంట్లో నుంచి 20 వేల రూపాయ‌ల న‌గ‌దును తీసుకెళ్లింది.

దీని త‌రువాత..త‌మ కుమార్తె క‌నిపించ‌ట్లేదంటూ న‌య‌న త‌ల్లిదండ్రులు ఆలూరు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న స‌మ‌యంలోనే మ‌డ‌బ‌లు గ్రామ శివార్ల‌లోనే ఇద్ద‌రు ప్రేమికులు ఉరి వేసుకుని క‌నిపించారు.

మృత‌దేహాల‌తో పాటు.. ఓ ఆత్మ‌హ‌త్య లేఖ‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త‌మ మ‌ధ్య తండ్రి, కుమార్తె బంధుత్వం ఉంద‌ని, అది తెలిసి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆ లేఖ‌లో రాసి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here