ఇంట్లోంచి పారిపోయారు..ఎక్క‌డున్నా సుఖంగా ఉంటారని అనుకున్నారే గానీ..!

తమ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఓ ప్రేమజంట ఆత్మహ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. త‌మిళ‌నాడులోని దిండిగ‌ల్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ ప్రేమికుల మృత‌దేహాలు జిల్లాలోని కోడైరోడ్డు వ‌ద్ద రైలు ప‌ట్టాల‌పై క‌నిపించాయి. మృతుల‌ను గురుస్వామి, కౌస‌ల్య‌గా గుర్తించారు రైల్వే పోలీసులు. మృత‌దేహాల‌ను జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

గురుస్వామి పొరుగునే ఉన్న మధురై జిల్లాకు చెందిన యువ‌కుడు. దిండిగ‌ల్ జిల్లా తిరువేంగ‌డం గ్రామానికి చెందిన కౌసల్యను ప్రేమించాడు. రెండేళ్లుగా వారి ప్రేమ వ్య‌వ‌హారం సాగుతోంది.

ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో రెండు కుటుంబాలవారూ ఆంక్ష‌లు విధించారు. దీనితో వారు ఇంట్లో నుంచి పారిపోయారు. దీనిపై త‌ల్లిదండ్రులు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ద‌ర్యాప్తు కొన‌సాగుతుండ‌గానే.. కోడైరోడ్డు వ‌ద్ద ప‌ట్టాల‌పై వారిద్ద‌రి మృత‌దేహాలు క‌నిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here