శివయ్య ద‌ర్శ‌నానికి జంట‌గా వ‌చ్చారు..పురుగుల మందు తాగారు..దీని ఫ‌లితం?

త‌మ పెళ్లికి ఇరు కుటుంబాల వారూ అభ్యంత‌రం చెప్ప‌డంతో ఓ ప్రేమజంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. పురుగుల మందు ప్ర‌భావానికి యువ‌తి మ‌ర‌ణించ‌గా.. ఆ యువ‌కుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వర ఆల‌యంలో సోమవారం రాత్రి ప్రేమికులు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు.

 

వారిని హ‌న్మ‌కొండ‌కు చెందిన హ‌రిప్రియ‌, సాయికుమార్‌గా గుర్తించారు. రెండేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. త‌మ పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ ప్ర‌య‌త్నంలో హరిప్రియ మృతి చెందింది. సాయికుమార్‌ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here