తొమ్మిదో త‌ర‌గ‌తి ప్రేమ‌! ఎక్క‌డిదాకా వెళ్లిందంటే!

పెద్దలు తమ పెళ్లికి అంగీక‌రించ‌ట్లేద‌నే ఒకే ఒక్క కారణంతో ఓ ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గోదావ‌రి న‌దిలో దూకి, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామ పరిధిలోని వైనతేయ వారధి వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వార‌ధి పై నుంచి గోదావ‌రి లోకి దూకి.. ఆ ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ట్విస్ట్ ఏమిటంటే.. ప్రేమికురాలు చ‌దువుతున్న‌ది తొమ్మిదో త‌ర‌గతే. జిల్లాలోని న‌గ‌రంకు చెందిన నాగశివదుర్గ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. పెదపట్నం గ్రామానికి చెందిన 14 ఏళ్ల ముత్యాల నాగ సుజిత తొమ్మిదో తరగతి చదువుతోంది. నగరంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ అదే గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది.

వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పిన సుజిత పెదపట్నంలోని తన ఇంటి నుంచి సైకిల్‌పై బయటకొచ్చింది.

 

మోటార్‌ సైకిల్‌పై వచ్చిన నాగశివదుర్గ తనను ఎక్కించుకుని పాశర్లపూడి వచ్చి వైనతేయ వారధిపై నుంచి గోదావరి నదిలోకి దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు వైన‌తేయ వార‌ధి వ‌ద్ద వారు వ‌దిలిపెట్టిన మొపెడ్‌లో ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న వారి కుటుంబ స‌భ్యులు శోక స‌ముద్రంలో మునిగిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నాగ‌శివ మృతదేహం లభ్యమైంది. యువతి మృత‌దేహం కోసం గ‌జ ఈత‌గాళ్లు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here