ప్రియురాలు ఇక లేద‌నే విష‌యాన్ని తెలుసుకుని..!

వ‌న‌ప‌ర్తి: త‌న ప్రియురాలు ఇక లేద‌నే విష‌యాన్ని తెలుసుకున్న ఆమె ప్రియుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న తెలంగాణ‌లోని వన‌ప‌ర్తి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని అప్పరాల గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, సరళల కుమార్తె సుశ్మితారెడ్డి కొత్తకోటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

 

అప్ప‌రాల గ్రామానికి చెందిన విక్రమ్‌నాయుడును ఆమె ప్రేమించింది. డిగ్రీ పూర్తిచేసిన విక్ర‌మ్ నాయుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విష‌యం వారి వారి ఇళ్ల‌ల్లో తెలిసింది. దీనితో కుటుంబ పెద్ద‌లు వారికి వార్నింగ్ ఇచ్చారు. ప్రేమ‌, పెళ్లి కుదర‌ద‌ని తేల్చి చెప్పారు.

 

అయిన‌ప్ప‌టికీ.. సుశ్మిత‌, విక్రమ్ త‌ర‌చూ కలుసుకునేవారు. దీన్ని గ‌మ‌నించిన సుశ్మిత కుటుంబ స‌భ్యులు ఆమెను తీవ్రంగా మంద‌లించారు. కొట్టారు. దీనితో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన సుశ్మిత శుక్రవారం ఇంట్లో పురుగుల మందును తాగింది. దీన్ని గ‌మ‌నించిన‌ కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గమధ్య‌లోనే మృతిచెందింది. త‌న ప్రియురాలి మరణవార్త విన్న విక్రమ్‌నాయుడు కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

శ‌నివారం తెల్లవారుజామున ఆత్మకూరు మండలం శ్రీరామ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు వ‌ద్ద రైలు కింద ప‌డి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన యువ‌తీ, యువ‌కులు కావ‌డంతో అప్ప‌రాల గ్రామంలో విషాదంలో మునిగిపోయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here