ద‌ట్ట‌మైన అడ‌విలో బైక్‌..ఆ ప‌క్క‌నే రెండు మృత‌దేహాలు: ఉరి వేసుకున్న స్థితిలో! బైక్‌పై ఎలా వెళ్లారో?

కార‌వార‌: ద‌ట్ట‌మైన అడ‌విలో ఓ ప్రేమజంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. ద‌ట్ట‌మైన అడ‌వి కావ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న అయిదు రోజుల త‌రువాత ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బైక్‌పై నిల్చుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు క్రైమ్ సీన్‌ను బ‌ట్టి చూస్తే తెలుస్తోంది.

అయిదురోజులు కావ‌డం వ‌ల్ల ప్రియుడి మృత‌దేహం కుళ్లిపోయి, చెట్టుపై నుంచి జారి కిందప‌డింది. న‌డ‌వ‌డానికే స‌రైన మార్గంలోని చోట ఆ ప్రేమికులు బైక్‌పై ఎలా వెళ్లారో తెలియ‌ట్లేద‌ని పోలీసులు చెబుతున్నారు. క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా కుమ‌ట తాలూకాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కుమ‌ట నుంచి యానా గ్రామానికి వెళ్లే మార్గం ద‌ట్ట‌మైన అడ‌వులతో నిండి ఉంటుంది. రోడ్డు నుంచి సుమారు కిలోమీట‌ర్ దూరంలో ఓ బైక్ స్థానికుల‌కు క‌నిపించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

తుల‌ను సుళ్య గ్రామానికి చెందిన ప్ర‌జ్ఞా పీ ఎస్‌, ఉత్త‌ర క‌న్న‌డ జిల్లాలోని ముండ‌గోడు సాల‌గావ్‌కు చెందిన విఠ్ఠ‌ల్ త‌మ్మ‌ణ్ణ‌వ‌ర్‌గా గుర్తించారు. మృత‌దేహాల‌తో పాటు బైక్‌, ఆత్మ‌హ‌త్య లేఖ‌ను పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కుమ‌ట పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here