యజమాని ఆసుపత్రిలో నాలుగు నెలల క్రితమే చనిపోయాడు.. కుక్క ఇప్పటికీ అక్కడి నుండి కదల్లేదు..!

కుక్కకు మనుషులకు ఉన్న అనుబంధం అలాంటిది.. ఇలాంటిది కాదు..! కొన్ని వేల ఏళ్ళుగా మనుషులతో ఎంతో విశ్వాసంగా ఉంటూ వస్తున్నాయి. మనుషులపై ఆ మూగజీవాలు చూపించే ప్రేమకు సంబంధించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే బ్రెజిల్ లో చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం ఆ కుక్క యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. అప్పటి నుండి అది ఆసుపత్రి బయటే ఉంటోంది.

బ్రెజిల్ లోని ‘శాంటా కాసా డినొవో హారిజోంటే’ ఆసుపత్రిలో నాలుగు నెలల క్రితం ఆ కుక్క యజమాని అయిన 59 ఏళ్ల వ్యక్తిని చేర్చారు. రోడ్డు మీద తలదాచుకుంటూ తిరిగే ఆ వ్యక్తి ఆ కుక్కను పెంచుకుంటూ ఉన్నాడు. అతడు గత ఏడాది అక్టోబర్ లో ఆసుపత్రిలో చేర్చారు. తన యజమానిని ఎక్కించిన అంబులెన్స్ వెనకనే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆసుపత్రి ముందు ఉండిపోయింది. ఆసుపత్రిలో చేర్పించిన రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ కుక్క మాత్రం తన యజమాని బయటకు వస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది దాన్ని స్థానికంగా ఉన్న కెన్నెల్స్ లో ఉంచారు.. కానీ అది అక్కడి నుండి తప్పించుకొని వచ్చి..ఆసుపత్రి ముందు కుర్చొంటూ.. తన యజమాని కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇక చేసేది లేక ఆసుపత్రి సిబ్బంది ఆ కుక్కకు తిండి పెడుతూ ఉన్నారు. పాపం తన యజమాని లేడని ఆ కుక్కకు తెలిసేది ఎన్నడో..!

Temos muito o que aprender com os animais. Esse cachorro fica todo dia na porta da santa casa de Novo Horizonte…

Cristine Sardellaさんの投稿 2018年2月27日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here