రాంగ్ నంబర్ ఈ మహిళ జీవితాన్ని నరకం చేసింది.. ఎలాగంటారా..!

రాంగ్ నంబర్ ఈ మహిళ జీవితాన్ని నరకం చేసింది. ఆమె సంసారాన్ని కాస్తా నాశనం చేసింది. బాధిత మహిళ లక్నోలో ఉండేది. ఆమెకు జనవరి 2, 2015న ఓ రాంగ్ నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు అలీ అని.. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పుకొచ్చాడు.

అతడు ఎవరో తెలియకపోయినప్పటికీ ఆమె అతడి మాటలు నమ్మేసింది. ఉద్యోగం కావాలనే ఉద్దేశ్యంతో వారితో మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో సుఖంగా ఉన్నప్పటికీ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని భావించింది.

ఫిబ్రవరి 12, 2015న అలీ దగ్గర నుండి మరోసారి ఫోన్ వచ్చింది. ఈసారి అతడిని ఆమె ఇంటికి పిలిపించింది. ఆ సమయంలో భర్త పిల్లలతో పాటూ బయటకు వెళ్ళాడు. ఆమెతో మీకు జాయింగ్ ఆర్డర్ ఇస్తాము.. నాతో పాటూ రావాలి అని కోరాడు. అతడితో పాటూ కారులో వెళ్ళిన ఆమెను లక్నో లోని ఓ ఫ్లాట్ లో నిర్బంధించారు. అంతే ఆమెను బయటకు రాకుండా చేసి చాలా రోజులు రేప్ చేస్తూ ఉన్నాడు. అలా కొన్ని నెలలకు ఆమె ఓ అమ్మాయికి జన్మనిచ్చింది. అయినప్పటికీ అతడు ఆమెను బయటకు పంపడానికి ఒప్పుకోలేదు. ఒకటిన్నర సంవత్సరం పాటూ ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమెతో వ్యభిచారం కూడా చేయించేవాడు. ఆ తర్వాత ఆమెను మరో సెక్స్ రాకెట్ వాళ్లకు అమ్మేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అదును చూసుకున్న మహిళ అక్కడి నుండి తన తొమ్మిది నెలల కూతురుతో పారిపోయి వచ్చేసింది.

పోలీసులను ఆశ్రయించిన ఆమెతో పలు వివరాలను సేకరిస్తూ ఉన్నారు. అలాగే ఆమెను వారి కుటుంబసభ్యులతో కలపడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here