పెరట్లో త్రవ్వుతుండగా.. ఇనుపపెట్టెను అసలు ఊహించలే..!

కొన్ని కొన్ని సార్లు అదృష్టం అనేది ఎలా వరిస్తుందో మనం అసలు ఊహించలేము.. ఒక్కసారి దశ తిరిగిందంటే ఇక తిరుగులేదు అని అంటూ ఉంటారే అది ఇదే..! న్యూజిలాండ్ లో పెరట్లో మొక్కలు నాటడానికి ఓ జంట త్రవ్వకాలు మొదలుపెట్టింది. అలా కొద్ది అడుగులు లోపలికి త్రవ్విందో లేదో.. ఓ ఇనుపపెట్టి కనిపించింది. ఆ ఇనుపపెట్టెను తెరచగా.. అందులో బంగారు ఆభరణాలు, కొన్ని వజ్రపు ఉంగరాలు దొరికాయి. వీటి ఖరీదు దాదాపు 40 లక్షల రూపాయలట.

స్లేటన్ ఐలాండ్ లో నివసిస్తున్న మాథ్యూ అతడి భార్య మారియాకు ఇలా అదృష్టం వరించింది. కొద్ది అడుగులు త్రవ్వగానే వారికి ఇనుపపెట్టె లభించింది. దాన్ని చూడగానే మొదట వాళ్ళు కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మనసును కాస్త సముదాయించుకొని. ఆ పెట్టెను తెరచి చూశారు. అందులో కొన్ని బంగారు నగలు, వజ్రాలు పొదిగిన డైమండ్ రింగ్ లభించాయని తెలిపారు. అయితే అందులో ఓ లెటర్ కూడా ఉంది. దీంతో పోలీసులను వాళ్ళు ఆశ్రయించి ఇది ఎవరికి చెందాలో వారికే ఇచ్చేయాలని భావించారు. అనుకున్నట్లుగానే ఆ లెటర్ లోని వివరాల ప్రకారం ఇది ఎవరో కొట్టేసి.. అక్కడ దాచిందని అర్థం అయిపోయింది. మాథ్యూ, మారియా కలిసి పోలీసుల వద్దకు వెళ్ళగా దీని గురించి 2011 లో పోలీసులు ఓ కేసును కూడా నమోదు చేశారట. దీంతో మాథ్యూ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ పెట్టెకు సంబంధించిన ఓనర్లకు అప్పజెప్పేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here