మ‌హేష్‌బాబుకు పాట పాడిన బాలీవుడ్ స్టార్ హీరో!

హైద‌రాబాద్‌: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు నటిస్తోన్న తాజా చిత్రం `భ‌ర‌త్ అనే నేను` సాంగ్ లిరిక్ విడుద‌లైంది. `ఐ డోన్ట్ నో..` అంటూ సాగే ఈ పాట‌ను బాలీవుడ్ స్టార్ హీరో ఫ‌ర్హాన్ అఖ్త‌ర్ పాడారు. ఓ తెలుగు పాట‌ను పాడ‌టం ఫ‌ర్హాన్ అఖ్త‌ర్‌కు ఇదే తొలిసారి.

ఈ పాట‌ను ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. దేవీశ్రీ‌ప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. దీనికి రాజు సుంద‌రం నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చారు. ఈ పాట‌ను రికార్డింగ్ చేస్తున్న స‌న్నివేశాల‌ను లిరిక్ ప్రోమో వీడియోలో ప్ర‌ద‌ర్శించారు. ఈ నెల 20న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here