పవన్ కళ్యాణ్ కోసం దీక్ష చేయనున్న హీరోయిన్..!

పవన్ కళ్యాణ్ నూ.. ఆయన తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టిన శ్రీ రెడ్డికి వ్యతిరేకంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు శ్రీ రెడ్డి చేస్తున్న పోరాటం దేనికి అని అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం హీరోయిన్ మాధవీలత ఓ అడుగు ముందుకు వేసి దీక్ష చేయడానికి రెడీ అయ్యారు.

శ్రీరెడ్డి కామెంట్స్‌పై నిరసన తెలిపేందుకు మౌన దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. పవన్ ఫ్యాన్స్, మానవత్వం ఉన్నవారు, భాషాభిమానులు… అందర్ని ఆహ్వానిస్తున్నానన్నారు. బుధవారం (18-04-2018) ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటల పాటూ మౌన దీక్ష చేపట్టి నిరసన తెలుపుతున్నానంటూ పోస్ట్ పెట్టారు మాధవీ లత. అలాగే పబ్లిసిటీ కోసం నా టైమ్ వేస్ట్ చేసుకోనని కూడా ఆమె చెప్పారు. మౌన దీక్ష చేయడం తనకు కూడా చాలా కష్టమేనని ఈ రోజు ఉదయం పోస్ట్ చేశారు. మానవత్వం ఉన్న వాళ్ళు వచ్చి ఈ దీక్షలో పాల్గొనాలని కోరారు మాధవీ లత.

Pawan fans and Human beings and also….. language lovers Invited to this MOUNA DEEKSHA PROTEST for 2 hours Tomorow morning 10 am to 12 pm( potta ninda breakfast tini randi)Thank youMaadhavi latha

Actress Maadhaviさんの投稿 2018年4月17日(火)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here