మాధవీలత అరెస్ట్.. తొలిసారి పోలీస్ స్టేషన్ కు వచ్చా..!

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ చాంబర్ ముందు మౌన దీక్షకు దిగిన నటి మాధవీలతను, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేని నిరసనలు చేస్తున్నారంటూ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మాధవీలత స్టేషన్ లోనే మౌనదీక్షకు దిగింది. ఫిల్మ్ చాంబర్ ముందు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతోందని భావించిన పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లను పిలిపించారు. అక్కడ మాధవీలతతో కూర్చుని ఉన్న పవన్ అభిమానులను తొలుత పంపించేసిన పోలీసులు, ఆపై ఆమెను స్టేషన్ కు తరలించారు.

తన ఫేస్ బుక్ ఖాతాలో మాత్రం మాధవీలత తన స్పందనని తెలియజేసింది. “నా జీవితంలో తొలిసారి పోలీస్ స్టేషన్ కు వచ్చాను. నేను అరెస్ట్ అయ్యాను. నన్ను బయటకు వదలడం లేదు. చేతిలో ఫోన్ ఒక్కటి ఉంచారు. అయితే, ఈ అనుభూతి బాగుంది” అని ఓ పోస్టు పెట్టింది. ఎవరు వచ్చినా, రాకున్నా తాను మాత్రం స్టేషన్ లోనే దీక్షను కంటిన్యూ చేస్తానని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here