ఇక్కడ జరుగుతున్నదేంటో తెలుసా..?

ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసా..? పోలీసుల ఇంటరాగేషన్ కాదు..! పోలీసు ఎలిజిబిలిటీ టెస్ట్.. అది కూడా ఆడ-మగ క్యాండిడేట్లకు ఒకే గదిలోనే నిర్వహిస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని భిండి ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్స్ కు సంబంధించిన మెడికల్ టెస్టులు ఇలా నిర్వహించారు. అది కూడా ఆడ-మగ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంచి. మంగళవారం జరిగిన ఈ మెడికల్ టెస్టులకు సంబంధించిన ఫోటోలు-వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొందరు యువకులు అక్కడికి వచ్చి తమ బట్టలు విప్పేసి.. కేవలం అండర్ వేర్ లతో నిలబడ్డారు.. అయితే అది గదిలోనే అమ్మాయిలకు చెస్ట్, హైట్ కు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కనీసం మహిళల కోసం లేడీ నర్సులు.. మహిళా కానిస్టేబుల్స్ కూడా లేరు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఎలా పరీక్షలు నిర్వహిస్తారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. చివరికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా దీనిపై స్పందించాడు. ఈ ఘటన చాలా సిగ్గుచేటని.. ఈ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తం 18 మంది మహిళా అభ్యర్థులను.. 21 మంది మగ అభ్యర్థులను ఒకే గదిలో ఉంచి మెడికల్ టెస్టులు నిర్వహించారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here