‘మహానటి’కి కాసుల వర్షం!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.. అన్ని వర్గాలను ఈ మూవీ ఆకట్టుకుంటున్నది.. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ 70 కోట్లు రాబట్టింది.. దీని ద్వారా నిర్మాతలు షేర్ రూపంలో రూ 40 కోట్లు దక్కాయి.. ఈ మూవీ ఒక్క అమెరికాలోనే ఏకంగా 2.50 మిలియన్ డాలర్లు – భారతీయ కరెన్సీలో 14 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.

ఈ ఏడాదిలో విడుదలైన భాగమతి, రంగస్థలం, భరత్ అను నేను మూవీలు మాత్రమే ఇప్పటి వరకూ మంచి కలెక్షన్స్ తో నిర్మాతలకు లాభాలు తెచ్చాయి.. ఒక చిన్న సినిమా ఇంత షేర్ తీసుకురావడం టాలీవుడ్ చరిత్రలోనే ఇది మొదటిసారి..మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో కీర్తీ సురేష్ సావిత్రి పాత్రలో నటించగా, సమంత, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, నాగ చైతన్య, షాలినీ పాండే తదితరులు నటించారు.. స్వప్న దత్, ప్రియాంకా దత్ లు ఈ మూవీకి నిర్మాతలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here