ఆ దేశంలో ‘మహానటి’ సినిమాను ఫ్రీ గా చూసేయొచ్చు.. కండీషన్స్ అప్లై..!

‘మహానటి’.. చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ గొప్ప సినిమా వచ్చింది. నటి సావిత్రి మహాతల్లి పడిన కష్టాలను, ఆమె జీవితంలోని సంఘటనలు తెర మీద అద్భుతంగా చూపించారు. ఇక విదేశాలలో అయితే వచ్చిన రెస్పాన్స్ సూపర్.. పెద్ద పెద్ద హీరోలకు కూడా అందని కలెక్షన్లు మహానటి సాధిస్తోంది. ఇక మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే అమెరికాలో అయితే మహానటి సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉచితంగా చూపిస్తున్నారు. ఇక్కడే కొన్ని కండీషన్లు అప్లై అవుతాయి.. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్లకు కాదు ‘యాభై అయిదు ఏళ్ళు పైబడిన’ వారి కోసం.

https://twitter.com/NirvanaCinemas/status/999172815700946944

అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన నిర్వాణ సినిమాస్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ‘పెద్దలందరినీ గౌరవిస్తూ.. మీ వయసు 55 ఏళ్లకు పైబడితే యూఎస్ లో ఈ శనివారం (5/26), ఆదివారం (5/27) ‘మహానటి’ని ఉచితంగా వీక్షించండి. ఈ కింద పేర్కొన్న జాబితాలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది’ అంటూ సంబంధిత పోస్టర్ ను జతపరుస్తూ ఓ ట్వీట్ చేసింది. వైజయంతీ మూవీస్ సంస్థ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని చూసేందుకు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళుతున్నారు. యాభై ఐదేళ్లు పైబడిన వారు ‘మహానటి’ని తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here