మహారాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ కోసం ఎవరి పేరును ప్రతిపాదించిందో తెలుసా..?

మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో చేసిన ఓ పనిని పలువురు వేలెత్తిచూపుతున్నారు.. అంతేకాకుండా అలాంటి నిందితులకు కూడా పద్మశ్రీ అవార్డులకు సిఫారసు చేస్తారా అని అందరూ తిడుతున్నారు. ఇంతకూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? మనోహర్ అలియాస్ శాంభాజీ భిడే.. ఈయన మీద పలు కేసులు ఉన్నాయి. భీమా-కొరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడైన ఈయన పేరును ‘పద్మ’ అవార్డుల సిఫారసు ఎలా చేస్తారని అందరూ మండిపడుతున్నారు.


రైట్ వింగ్ నేత అయిన శాంభాజీ భిడే ముందు నుండి వివాదాస్పద నేతగా పేరుంది. మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘పద్మ’ అవార్డు కోసం అతని పేరును సిఫార్సు చేసింది. పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ భిడేను ‘పద్మశ్రీ’ అవార్డు కోసం సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడే కూడా ఒక నిందితుడు. సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ భిడేపై మరో కేసు కూడా ఉంది. 2008లో ‘జోధా-అక్బర్’ సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్నాడట. 84 ఏళ్ల భిడే తొలి నుంచీ వివాదాస్పద నేతగానే ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఎలా పద్మ అవార్డు కోసం సిఫారసు చేశారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన మంచి వారని.. లేనిపోనివి కల్పిస్తూ తప్పుడు కేసుల్లో ఇరికించారనేది మరికొందరి వాదన..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here