ఆయ‌న అమ్ముతున్న‌ది వేడి, వేడి టీ మాత్ర‌మే! నెల ఆదాయం ఎంతో తెలిస్తే దిమ్మ తిరుగుద్ది!

పుణే: టీ అమ్మ‌డం ద్వారా ఎంత ఆదాయం నెల‌కు ఎంత ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. ఎంత బాగా న‌డిచినా మ‌హా అంటే 30 వేలు.. ఇంకా బాగా న‌డిస్తే అర ల‌క్ష లేదా ల‌క్ష‌. మ‌రి ప్ర‌తినెలా 12 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడంటే ఏమ‌నాలి?

నిజం- పుణేలోని ఓ చాయ్ వాలా ఏకంగా 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఆర్జిస్తున్నారు. ఆయ‌న పేరు న‌వ్‌నాథ్‌. టీ షాప్ పునే యెవ్‌లె..అమృత‌తుల్య అనేది దాని ట్యాగ్‌లైన్‌.

వేడి వేడి టీ అమ్మ‌డం ద్వారా మాత్ర‌మే ఆయ‌న ప్ర‌తినెలా 12 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడంటే మాట‌లు కాదు. ఇక్క‌డి టీ చాలా స్పెషల్. తెల్ల‌వారు జాము నుంచీ ఇక్క‌డ దొరికే టీకి భలే గిరాకీ ఉంటుంది.

జ‌నం బారులు తీరి నిల్చుని ఉంటారు టీ కోసం. షాప్ తెరిచిన‌ప్ప‌టి నుంచి మ‌ళ్లీ మూసేంత వ‌ర‌కూ గుంపులు గుంపులుగా ఉంటార‌క్క‌డ‌. నవ్‌నాథ్‌కు పూణే సిటీలోనే మూడు టీస్టాల్స్ కూడా ఉన్నాయి.

ప్రతీ స్టాల్‌లో 12 మంది పనిచేస్తున్నారు. భారత్‌లో టీ స్టాల్ ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారని నవ్‌నాథ్ తెలిపారు. టీ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తానని చెబుతున్నారాయ‌న‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here