అబుదాబీలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.. గల్ఫ్ దేశాల్లో మొదటిది..!

యుఏఈ-భారత్ మధ్య బంధాలు మరింత బలపడనున్నాయి. భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు యుఏఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తీ చేసింది. యుఏఈ ప్రభుత్వం గొప్పతనం ఇదేనని అక్కడ ఉన్న భారతీయులు మెచ్చుకుంటూ ఉన్నారు. గురువారం నాడు అబుదాబీలో ఉన్న ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ లో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఐ.ఎస్.సీ. యాక్టింగ్ ప్రెసిడెంట్ జయచంద్రన్ నాయర్ ఈ ఘటనపై మాట్లాడుతూ మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి యుఏఈ ప్రభుత్వం సముఖంగా ఉందని.. వారు తమ వెన్నంటే ఉన్నారని తెలిపారు. మహాత్ముడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించడం ద్వారా భారత్-యుఏఈ మధ్య స్నేహబంధం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.. విటీవీ దామోదరన్ ఈ ప్రాజెక్ట్ ను దగ్గరుండి పూర్తీ చేశారు. ఆయన గాంధీ సాహిత్య వేది ప్రెసిడెంట్ గా ఉన్నారు. గాంధీ మహాత్ముడి విగ్రహం ఓ గల్ఫ్ దేశంలో ప్రతిష్టించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఇది చారిత్రాత్మక అంశమని ఆయన అన్నారు. కేరళకు చెందిన చిత్రన్ కున్హిమంగళం ఆరు నెలలపాటూ శ్రమించి గాంధీ మహాత్ముడి విగ్రహాన్ని రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here