అభిమానులను కలవకుండా వేరే దారిలో వెళ్ళిపోయిన మహేష్ బాబు.. నిరసనకు దిగిన ఫ్యాన్స్..!

అభిమానులు.. తమ హీరో ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొని వెళ్లిపోతుంటారు. ఏదో ఒక ఫోటోనో, కరచాలనం తీసుకుందామనో వాళ్ళ ఉద్దేశ్యం. అదే హీరో వాళ్ళను కనీసం పట్టించుకోకపోతే అభిమానుల ఆగ్రహాన్ని అదుపుచేయడం ఎవరితరం కాదు..! ఇప్పుడు ఇదే అనుభవం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఎదురయింది. తమను కలుస్తాడు.. కలుస్తాడు అని భావించిన మహేష్ వారిని కలవకుండా వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడ్డారు అభిమానులు.

మహేష్ బాబు కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లక్డీకాపూల్ లో మూతబడివున్న ‘అమరావతి’ థియేటర్ లో జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమను మహేష్ బాబుతో కలిపించాలని ఆయన పీఏ పరుచూరి కోటిని కోరగా, ఆయన నిరాకరించాడు. దీంతో అభిమానులు కోటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఇంతలో మహేష్ బాబు తన షూటింగ్ ను ముగించుకుని మరోదారిలో బయటకు వెళ్లిపోవడంతో అభిమానుల ఆందోళన మరింత పెరిగింది. సైఫాబాద్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. అభిమానుల గొడవతో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here