తన అభిమాని అయిన పెళ్ళి కూతురుకు మహేష్ బాబు ఏ గిఫ్ట్ పంపాడో తెలుసా..!

కొన్ని కొన్ని సార్లు కొందరు స్టార్స్ తమ అభిమానులకు కొన్ని గిఫ్ట్ లు పంపుతూ ఉంటారు. వాటిని చాలా అరుదుగా దాచుకుంటూ ఉంటారు అభిమానులు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అలాంటి గిఫ్ట్ నే పంపారు. అది కూడా తన అభిమాని పెళ్ళి రోజు.. అంతకంటే మించిన బహుమతి ఉంటుందా ఆమెకు చెప్పండి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ బాబుకు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి సెపరేట్ గా చెప్పాలా..? ఆ లిస్టు లో సులేఖ అనే అమ్మాయికి మహేశ్ అంటే ప్రాణం. ఇటీవలే సులేఖకు పెళ్లి జరిగింది. అయితే ఆమె కుటుంబసభ్యులు మాత్రం సులేఖకు ఓ స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. అదేంటంటే మహేశ్ తన సైన్‌తోపాటు ఆయన భార్య నమ్రతా సంతకం చేసిన పర్సనల్ గ్రీటింగ్‌ కార్డు. ఇక ఆ గ్రీటింగ్ కార్డు చూసి సులేఖ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏది ఏమైనా కానీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్ళి రోజున.. మనం ఎంతో ఆరాధించిన ఫేవరేట్ హీరో నుండి విషెస్ అందుకుంటే వచ్చే కిక్కే వేరు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here